NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ భద్రత కల్పించాలి..

1 min read

పల్లెవెలుగు, వెబ్ చాగలమర్రి : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ మీటర్‌ రీడర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆళ్ళగడ్డ తాలుకా మీటర్‌ రీడర్ల సంఘం అధ్యక్షుడు డిఏ బాబు డిమాండ్ చేసారు.శనివారం స్థానిక విద్యుత్‌ కేంద్రంలో రాష్ట్ర సదస్సు కు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 న విజయవాడలో జరిగే విద్యుత్‌ కార్మికుల రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నారన్నారు.ఈ సదస్సుకు విద్యుత్‌ మీటర్‌ రీడర్ల కార్మికులు తరలి రావాలని పిలుపు నిచ్చారు.పీసు రేటు రద్దు చేయాలని,నెల వారి వేతనం చెల్లించాలని,సిపిడిసిఎల్‌ పరధిలో కుదించిన పనిదినాలు  పునరుద్దరించాలని అలాగే కాంట్రాక్టర్ల వేధింపులు నివారించాలన్నారు.యాజమాన్యం నిర్ణయించిన రేట్లను రీడర్లకు ఇవ్వాలన్నారు.ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామిని నెరవేర్చాలని డిమాండ్ చేసారు.కార్యక్రమం లో ఐక్యకార్యాచరణ సభ్యులు విశ్వం,మాబుసేన్‌,చిన్న,దస్తగిరి,రఫి,సుబ్రమణ్యం,తదితరులు పాల్గొన్నారు.

About Author