స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఏఐటీయూసీ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ… ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఏపీ అంగన్వాడి అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు విశాలాక్షి. కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో శుక్రవారం స్కీం వర్కర్ల డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. స్థానిక సిపిఐ ఆఫీస్ నుండి ఏపీ అంగన్వాడి హెల్పర్స్ ఆశా వర్కర్లు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ఏపీ అంగన్వాడి అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు విశాలాక్షి అధ్యక్షత జరిగిన కార్యక్రమంఓల ఏఐటియుసి తాలూక కార్యదర్శి మునిస్వామి, మండల కార్యదర్శి కృష్ణమూర్తి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాధమ్మ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో స్కీం వర్కర్ల పాత్రకీలకమన్నారు. కార్యక్రమంలో అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు చిట్టెమ్మ ,ఛాయాదేవి ,ప్రమీల ,ఆదిలక్ష్మి ,ఆశా వర్కర్స్ అన్నపూర్ణ ,భారతి ,సునీత స్వర్ణలత ,మంజుల ,వీరమ్మ ,నిర్మల ,గీతా వాణి ,సరోజమ్మ ముంతాజ్ ,గీతమ్మ ,సులోచనమ్మ , జై లక్ష్మి, పద్మావతి, అన్నపూర్ణ, ఆరోగ్యమిత్ర మండల నాయకులు సుబాన్ సీనియర్ నాయకులు ఉరుకుంద అప్ప బ్రహ్మయ్య మండల సహాయ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.