ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కర్నూలు లోని ఐటీఐ పాసైన అభ్యర్థుల కోసం.. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో ప్రజా రవాణ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. మెుత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్రవి తెలిపారు. ఏ.పీ.ఎస్. ఆర్టీసీ నందు ఐ.టి.ఐ అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సినఅభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎస్.ఎస్.సి, మరియు ఐ.టి.ఐ తో పాటు SC/ST/BC కుల ధ్రువీకరణ పత్రాలు వికలాంగులైనవారు వికలాంగు ధ్రువీకరణ పత్రము మాజీసైనికుల పిల్లలైనా వారు ధ్రువీకరణ పత్రము మరియు యన్.సీ.సీ లేదా స్పోర్ట్స్ ( యూనివర్సిటీ/ రాష్ట్ర/ జాతీయస్థాయి సర్టిఫికెట్) మరియు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తో కళాశాల నందు సంప్రదించవలెను. ఆసక్తి ఉన్నవారు ఈనెల 7 నుంచి 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజా రవాణ సంస్థ జోనల్ కళాశాల ప్రిన్సిపల్ కె.రవి తెలిపారు. www.apprenticeshipidia.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎలాంటి పరీక్ష ఉండదని, పత్రాల పరిశీలనకు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని చెప్పారు. సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు జోనల్ కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.