PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను ఒంగోలులో నిర్వహించనున్నారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది.

                            

About Author