కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : “కేంద్రీయ విద్యాలయ సంగతన్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్డీసీఈ) 2022 ద్వారా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, పీజీటీ, టీజీటీలు అండ్ హెడ్ మాస్టర్‌ల పోస్టులను భర్తీ చేయబోతోంది” అని కేవీఎస్ ఒక నోటీసులో పేర్కొంది. నవంబర్ 2 న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో ఆన్ లైన్ లింక్ యాక్టివేషన్ కానున్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎల్డీసీఈ పరీక్ష తేదీన త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్డీసీఈ) 2022 ద్వారా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, పీజీటీ, టీజీటీలు మరియు హెడ్ మాస్టర్‌ల పోస్టుల భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈడీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. సర్వీస్ ఎక్స్ పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కొరకు https://kvsangathan.nic.in వెబ్ సైట్ సందర్శించొచ్చు. అభ్యర్థులు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. దీనిలో ప్రిన్సిపాల్ పోస్టులు 278, వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 116, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు 7, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 22, పీజీటీ పోస్టులు 1200, టీజీటీ పోస్టులు 2154, హెడ్ మాస్టర్ పోస్టులు 237 ఉన్నాయి.