PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య,ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులను పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెడికల్ ఆఫీసర్ 25, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ 1 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ లేదా పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,495, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,495, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని.. ఆ దరఖాస్తు ఫారమ్ తో పాటు విద్యార్హత సర్టిఫికేట్లను జతచేయాలి. వాటిని నవంబర్ 12, 2022లోగా.. జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://spsnellore.ap.gov.in/ను పరిశీలించవచ్చు.

About Author