అణు శక్తి విభాగంలో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్…. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో): 9 పోస్టులు
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్‌వో): 38 పోస్టులు
- సెక్యూరిటీ గార్డులు: 274 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జేటీవో పోస్టులకు 18 నుంచి 24 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.
ఎంపిక: పోస్టును అనుసరించి లెవల్-1(రాత పరీక్ష), లెవల్-2(డిస్ర్కిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 17
ఏఎస్‌ఓ-ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఫిజికల్ టెస్ట్ తేదీలు: 2022 డిసెంబరు
జేటీవో(లెవల్-1), సెక్యూరిటీ గార్డు పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 2023 జనవరి
జేటీవో(లెవల్-2), ఏఎస్‌ఓ-ఎ డిస్ర్కిప్టివ్ టెస్ట్: 2023 ఫిబ్రవరి
వెబ్‌సైట్: https://amd.gov.in