NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీసీఎస్ లో ఉద్యోగాల జాత‌ర‌..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా క‌న్సల్టెన్సీ సర్వీసెస్ త్వర‌లో భారీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించ‌బోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో దాదాపు 40 వేల కొత్త ఉద్యగాలు సృష్టించ‌బోతోంది. గ‌త ఏడాదిలాగే .. ఈ ఏడాది కూడ కొత్త ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోబోతోంది. ఒక త్రైమాసికంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డం చాలా అరుదు. కంపెనీ నుంచి ఉద్యోగుల వ‌ల‌స‌లు కూడ చాలా వ‌ర‌కు తగ్గాయి. మార్కెట్ లో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉద్యోగుల్ని నియ‌మించుకోబోతున్నారు. ఈ స్థాయిలో రిక్రూట్ చేసుకోవ‌డం ఒక రికార్డు. తొలి త్రైమాసికంలో కొత్త రిక్రూట్ మెంట్ పూర్తయితే..కంపెనీ ఉద్యోగుల విలువ 5 ల‌క్షల‌కు చేరుకుంటుంది. అంత‌ర్జాతీయంగా చూస్తే.. అసెంచ‌ర్ కంపెనీ త‌ర్వాత టీసీఎస్ రెండో స్థానంలో ఉంటుంది.

About Author