PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త వైమానిక ద‌ళం ప‌ర్మనెంట్, షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్ లైన టెస్ట్ కు ప్రక‌ట‌న విడుద‌లైంది. ప్రతి సంవ‌త్సరం మే,జూన్, డిసెంబ‌రులో ఈ ప్రక‌ట‌న ఉంటుంది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: భార‌త వైమానిక ద‌ళం
ఉద్యోగం: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ, ఎన్ సీసీ స్పెష‌ల్ ఎంట్రీ, మెటీయోరాల‌జీ ఎంట్రీ.
ఖాళీలు: 334
బ్రాంచ్ ఖాళీలు:

  1. ఎఎఫ్ క్యాట్ ఎంట్రీ
    ఫ్లయింగ్ – 96, గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్- 137, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నిక‌ల్- 73
  2. ఎన్ సిసి స్పెష‌ల్ ఎంట్రీ
    బ్రాంచ్- ఫ్లయింగ్
  3. మెటీయోరాల‌జీ ఎంట్రీ- 28
    వ‌య‌సు: ప‌్లయింగ్ బ్రాంచ్ పోస్టుల‌కు 20 నుంచి 24 ఏళ్ల‌లోపు ఉండాలి. మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు .
    ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైల‌ట్ ఆప్టిట్యూడ్ బ్యాట‌రీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక‌.
    ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
    ద‌ర‌ఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ అభ్యర్థులు 250 చెల్లించాలి. మిగిలిన వారికి అవ‌స‌రం లేదు.
    ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1-6-2021
    ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30-6-2021

అధికారిక వెబ్ సైట్: https://careerindianairforce.cdac.in

About Author