NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన జడ్జీలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
మొత్తం పోస్టుల సంఖ్య: 25
ఉద్యోగం : కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు.
అర్హత: ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌(నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.37,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును కింది అడ్రస్ కు పంపాలి.
రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌),
హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్,
నేలపాడు,
అమరావతి,
గుంటూరు–522237
దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

About Author