PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోయ‌లుక్కాస్.. అక్ష‌య తృతీయ ఆఫ‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అక్షయ తృతీయను పురస్కరించుకుని జోయాలుక్కాస్‌ జువెలరీ సంస్థ‌ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రత్యేకంగా గిఫ్ట్‌ వోచర్స్‌ను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ తెలిపింది. రూ.50,000, అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్‌ వజ్రా లు, విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్‌ వోచర్‌, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ను అందిచనున్నట్లు తెలిపింది.

                                    

About Author