మార్చి నుంచి రేషన్ బంద్: నిర్వాహకులు
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా గడివేముల మండలం లోని mdu ఆపరేటర్ రేషన్ బండి వాహనదారులు మార్చి ఒకటో తేదీ నుండి రేషన్ సేవలు బంద్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ వాహన ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే చెల్లిస్తుందని అగ్రిమెంట్లో పేర్కొన్నారని. కానీ రెండునెలలుక్రితం మా జీతం నుండి10.200.00 కట్ అయిందని మేము ఉన్నత అధికారులకు అర్జి ఇవ్వడం జరిగింది. కానీ అధికారుల నుండి ఎటువంటి సమాధానం రాలేదని అందుకు నిరసనగా మార్చి ఒకటవ తేదీ నుండి రేషన్ బండ్లను నిలిపి వేస్తున్నట్లు mdu నిర్వాహకులు మద్దిలేటి. శివ రాముడు. యాకోబు వలి. పుల్లయ్య. రాజశేఖర్. ప్రసాద్. సుబ్బయ్య. శివారెడ్డి. సలీమ్ భాష తెలిపారు.