జొహరాపురంలో ఎటు వెళ్లినా సమస్యలే..!
1 min read– ఈ సమస్యలకు వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి
- టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి. భరత్
కర్నూలు, పల్లెవెలుగు: జొహరాపురంలో ఏ వీధికి వెళ్లినా ప్రజలు సమస్యలే చెబుతున్నారని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. జొహరాపురంలో దర్గా వీధి, సునీతా స్కూల్ లైన్‌లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇళ్లు దుకాణాల వద్దకు వెళ్లి వృద్దులు, పెద్దలు, మహిళలు, యువకులను కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా స్థానికులు అమ్మ ఒడి అందలేదని.. ఇళ్లు పెద్దగా ఉందని పెన్షన్ తీసేశారని తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అర్హులకు పథకాలకు అందడం లేదన్నారు. సాకులు చూపుతూ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. దోమల సమస్యల తీవ్రంగా ఉన్న జొహరాపురంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏడాదిన్నర పాప దోమలు కుట్టి రోగాల బారినపడి చనిపోయిందని స్థానికులు చెప్పారని భరత్ తెలిపారు. రెండు నెలలకు ఒకసారి కాలువలు శుభ్రం చేయడం ఏంటని ప్రశ్నించారు. సరైన నాయకుడు పాలకుడిగా లేకపోతే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులే ఉంటాయన్నారు. ప్రజా సేవ చేసే టీజీ కుటుంబం నుంచి వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కర్నూలులో సమస్యలు అన్నింటిని గుర్తించి తెలుసుకుని ఆరు గ్యారంటీలు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇవన్నీ పూర్తి చేస్తే ప్రజల సమస్యలు తీరడంతోపాటు నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారానికి వచ్చే వైసీపీ నేతలను సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్, వెంకటయ్య, మాధవస్వామి, తిమ్మోజీ, శ్రీనివాస్ గౌడ్, వెంటటేశ్ గౌడ్, యల్ల గౌడ్, ప్రతాప్, శాంతన్న, నాగరాజు, భాస్కర్, కౌలుట్ల, తిమ్మప్ప, అబ్బుల్లా, శ్రీను, శాంతమ్మ, చిట్టెమ్మ, కుమార్, రఫీక్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.