వైసీపీ ఇంచార్జి పెత్తనం ఇమడలేకనే..వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరా..
1 min readఎమ్మెల్యే ఆర్థర్ ప్రకటన వైసీపీ పార్టీలో దుమారం..
ప్రజలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ .
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన వైసీపీ పార్టీలో పెను దుమారం రేపుతోంది. 2019 లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే గా ఎన్నికైన అధికార పెత్తనం ఇంచార్జి కి ఇవ్వడంతో నందికొట్కూరు ప్రజానీకానికి న్యాయం చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ఆర్థర్..
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కర్నూల్ జిల్లా, నందికొట్కూరు ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్థర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఐప్యాక్ సర్వేలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చిందని అయిన తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని ఆయన తెలిపారు.
ఇంచార్జి పెత్తనం ఇమడలేకనే…
నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. నందికొట్కూరు టికెట్ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాటలు విని తాను షాకయ్యానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారులు లేకుండా చేశారని ఆర్థర్ చెప్పుకొచ్చారు. వైసీపీలో ఇమడలేకనే బయటకు వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని.. అందుకే తనకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే చేరానని ఆర్థర్ చెప్పారు.