వైసీపీ నుంచి టీడీపీలో చేరిక..
1 min read
మాధవరం వైకాపా కీలక 50 కుటుంబాలు టిడిపి లోకి చేరిక
- మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు :రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి, మమ్మల్ని నమ్మి వైకాపా నాయకులు టిడిపి లో కి వస్తున్నారని వారికి అండగా ఉంటామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మాధవరం గ్రామనికి చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు విశ్వ బ్రాహ్మణ నరసింహులు, మండలం అధ్యక్షుడు ఊరుకుందు ఆధ్వర్యంలో కమ్మరి ఊరుకుందు, నరసింహులు, నారాయణ,వీరేష్,నర్సప్ప,బీమన్నా,హనుమంతు వీరేష్,వెంకటేష్ నరసింహులు,చిన్న బీమన్నా మరియు 50 కుటుంబాల కార్యకర్తలు వైకాపా కు రాజీనామా చేసి మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, మంచాల సొసైటీ ఛైర్మెన్ మాధవరం రామకృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ లో వస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతున్న కష్టాన్ని గుర్తించి పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వీరి కి ఎల్లవేలల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలో వైకాపా నుండి టిడిపి లోకి చాలా మంది వచ్చేందుకు సిద్ధం గా వున్నారని తెలిపారు. అనంతరం పార్టీ లో చేరిన కీలక నాయకులు ఉరుకుందు, నరసింహులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుండడం, సంక్షేమం, అభివృద్ధిని చూసి రావడం జరిగిందని తెలిపారు. అలాగే ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి పేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఎంతో మంది కి చెక్ లను ఇప్పించడం, నియోజవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తునందుకు ఆనందం గా ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు రాకేష్ రెడ్డి, టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ బారిక ఉరుకుందు, నారాయణ, వీరేష్, ఆచార్, మహేష్, నరసప్ప, కుమార్, నరసన్న, బ్రహ్మయ్య, కుమార్, చిన్న భీమన్న, వెంకటేష్, నవీన్, హనుమంతు, భీమన్న, చిన్న భీమన్న, నర్సింహులు, మూసన్న, ఆచారిలు పాల్గొన్నారు.