రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు
1 min read– ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన APCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దాసరి చింతలయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సేవాదళ్ మహిళా నాయకురాలు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రియా, సరిత,మహిళ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు జయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల వల్ల సాధారణ ప్రజానీకానికి మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందని ఆలోచనతో ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు నాయకులు పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారని తెలియజేశారు.ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఈ దేశానికి సామాన్య పౌరులకు మేలు జరుగుతుందని కొనియాడారుగత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విధానాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది అని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరవ తరగతి పదో తరగతి చదివిన వారికి కూడా ఓటు హక్కు కల్పించటం జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగమ అని ప్రశ్నించారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుందని వాపోయారు ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం నేర్పాలని అందుకే కాంగ్రెస్ పార్టీ వాదులు పార్టీల చేరి ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్రావు, నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, సేవాదళ్ మహిళా నాయకురాలు జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి సేవాదళ్ మస్తాన్ ఖాన్, జిల్లా సెక్రెటరీ అబ్దుల్ రెహమాన్, జిల్లా ట్రెజరర్ ఎస్ వై డి ప్రసాద్, ఐ ఎన్ టి సి జిల్లా కార్యదర్శి ఆర్టీసీ ప్రసాద్, జిల్లా కార్యదర్శి పాస్టర్ పాలరాజ్, ఆనంద్ రావు, సేవ దళ్ నాయకులు మద్దిలేటి ,వెంకటపతి, ప్రియా, సరిత, మైనారిటీ నాయకుడు భాష తదితరులు పాల్గొన్నారు.