వైసీపీ నుంచి టిడిపిలోకి కార్పోరేటర్ కైపా పద్మలతా రెడ్డి చేరిక
1 min readవైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేనందునే టిడిపిలో చేరాను.. కార్పోరేటర్ కైపా పద్మలతా రెడ్డి
టి.జి భరత్ సమక్షంలో తన అనుచరులను టిడిపిలో చేర్పించిన కార్పోరేటర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదని గ్రహించి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు కర్నూలు నగరంలోని 17వ వార్డు కార్పోరేటర్ కైపా పద్మలతా రెడ్డి చెప్పారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఇటీవల ఆమె వైసీపీని వీడి టిడిపిలో చేరారు. మంగళవారం నగరంలోని మౌర్య ఇన్‌లో తన అనుచరులను ఆమె తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. టి.జి భరత్ వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ పద్మలతా రెడ్డి మాట్లాడుతూ రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా కర్నూలు అభివృద్ధిలో పాలుపంచుకుందామన్న ఉద్దేశంతో ఎంతో ధైర్యం చేసి వైసీపీని వీడి టిడిపిలో చేరినట్లు స్పష్టం చేశారు. వైసీపీలోని నాయకులు కర్నూలు అభివృద్దిని పక్కన పెట్టి.. వాళ్ల సొంత పనులు చేసుకుంటున్నారని చెప్పారు. ఎంతో ఒత్తిడిని తట్టుకొని వైసీపీని వీడి.. టిడిపిలోకి వచ్చానన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు చిన్న చిన్న పథకాలు అందించి.. ధరలు మాత్రం పెంచేసి ప్రజలపై భారం మోపారని ఆమె అన్నారు. కర్నూల్లో టి.జి భరత్ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టి.జి భరత్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. టిడిపి హయాంలో కర్నూల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేయడంతో పాటు, పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుచేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కర్నూల్లో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో దుర్గ, లత, నరసింహ, రమణ, మధు, రాయల్ మధు, కైపా రామక్రిష్ణా రెడ్డి, రామక్రిష్ణ, ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు కె.వి సుబ్బారెడ్డి, బాబ్జీ, విజయకుమార్, వినోద్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 1వ వార్డుకు చెందిన భారతి, సంధ్య కుటుంబాలు వైసీపీని వీడి.. టిడిపి నాయకురాలు మారుతీ శర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.