ఉధ్యాన పంటలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
1 min read
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నేల తేమ పరిరక్షణ పద్ధతులు పాటించాలి
పాల్గొన్న జిల్లా ఉద్యాన అధికారి ఎస్ రామ్మోహన్రావు, మండల,గ్రామ ఉద్యాన అధికారులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కామవరపుకోట, ఉద్యాన శాఖ ద్వారా అమలు చేయుచున్న వివిధ పదకములు రైతు సేవ కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు చేరాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామవరపుకోట మండలంలో తడికలపూడి గ్రామంలోఉధ్యాన పంటలను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ , కొబ్బరి తోటలలో సాగు చేస్తున్న బహుళ మరియు అంతర పంట విధానాన్ని, ఉద్యాన యాంత్రీకరణలో ఉడ్ చిప్పర్, చాప్ కట్టర్ పనితీరును పరిశీలించారు. గ్రామ ఉద్యాన సహాయకులకు ప్రతి ఒక్కరు 1 లేదా 2 మోడల్ ఫార్మ్స్ మరియు ఉద్యాన అధికారులు ప్రతి ఒక్కరు 2 లేదా 3 మోడల్ ఫార్మ్స్ ను ఏర్పాటు చేయాలనీ దీని ద్వారా రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం వస్తుందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా నెల తేమ పరిరక్షణ పద్దతులను పాటించాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ సామాజిక ప్రకృతి వ్యవసాయం (ఏపీ సీఎన్ ఎఫ్) వారితో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా ఉద్యాన అధికారి ఎస్.రామ్మోహన్, ఉద్యాన సహాయ సంచాలకులు,మండల ఉద్యాన అధికారులు, గ్రామ ఉద్యాన సహాయకులు ,ఉద్యాన రైతులు హాజరయ్యారు.
