PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డబల్ రోడ్డు పనులను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లె నుండి పుష్పగిరి వరకు 9 కోట్ల రూపాయలతో జరుగుతున్న డబల్ రోడ్డు పనులను కడప జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ శనివారం సాయంత్రం పర్యవేక్షించారు, ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న పనులపై ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, డి ఈ లు శ్రీవిద్య, శేషావలిని అడిగి తెలుసుకున్నారు, అలాగే కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, దీంతో అధికారులు రెండు నెలల లోపల పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ కి తెలిపారు, అంతేకాకుండా ఉప్పరపల్లి శివాలయం వద్ద, అలాగే శివాలపల్లె వద్ద నిర్మాణంలో ఉన్న చిన్న బ్రిడ్జిలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎంపీటీసీ ఎరసాని నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

About Author