ఉమ్మడి పౌర స్మృతి కాదు..ఉపాధి చూపండి !
1 min readపల్లెవెలుగువెబ్ : బీజేపీ నేతలు తరచు మాట్లాడుతున్న ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై ముందు దృష్టి సారించాలని ఒవైసీ చెప్పారు. ఏఐఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇప్పటికిప్పుడు దేశానికి యూసీసీ అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు.