PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌ర్న‌లిజం ప్ర‌జాస్వామ్యానికి వెన్నెముక

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జర్నలిజం స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాజస్థాన్‌ పత్రిక అధినేత గులాబ్‌ చంద్‌ కొఠారి రచించిన గీతా విజ్ఞాన ఉపనిషత్తు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ రమణ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు కళ్లు, చెవుల్లాంటివారని తెలిపారు. మీడియా సంస్థలు వాస్తవాలు చెప్పడం తమ బాధ్యతగా భావించాలని, నిజాయితీని పాటించాలని హితవు పలికారు. తరచూ వ్యాపార ప్రయోజనాల వల్ల స్వతంత్ర జర్నలిజం స్ఫూర్తి దెబ్బతింటుందని, దాని ఫలితంగా ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తాను లా చదువుకునే ముందు కొద్దిరోజులు జర్నలిస్టుగా పని చేశానని, వార్తల సేకరణకు బస్సులో ప్రయాణించానని ఆయన చెప్పారు.

                                                   

About Author