రష్యా దాడుల్లో జర్నలిస్ట్ మృతి
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్దంలో ఓ జర్నలిస్ట్ మృతి చెందారు. ఉక్రెయిన్‌లోని ఇర్పెన్‌లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ దుర్మరణం పాలయ్యారు. మరో జర్నలిస్ట్ గాయపడ్డారని కీవ్ పోలీస్ చీఫ్ ఆండ్రివ్ నెబిటోవ్ తెలిపారు. బ్రెంట్ రెనాడ్ వయసు 51 సంవత్సరాలు. ఆయన మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి తరలించేందుకుు యత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.