జర్నలిస్టు కోవిడ్ బాధితులకు అండగా ఉంటాం..
1 min read– విజయవాడ మీడియా మిత్రులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన
ది కృష్ణా జిల్లా డ్రగ్స్ హోల్ సెల్ డ్రగ్ ట్రేడర్ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి బుజ్జి
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: కరోనా వార్తలు నిరంతరం ప్రజలకు చేరవేస్తున్న విలేకరులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు అనుసంధానంగా ఉంటున్నారని, విధి నిర్వహణలో విలేకరులు కూడా నిండు నూరేళ్ల జీవితాలను ఫణంగా పెడుతున్నారని, అందుకే వారికి తమ అసోసియేషన్ ద్వారా చేతనైనంత సాయం చేస్తామని ది కృష్ణా జిల్లా డ్రగ్స్ హోల్ సెల్ డ్రగ్ ట్రేడర్ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి బుజ్జి హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో కోవిడ్– 19 బారిన పడిన విలేకరులు, వారి కుటుంబ సభ్యులకు (హోం క్వారంటైన్లో ఉన్న వారికి) మంగళవారం నుంచి ఉచితంగా మందులు అందజేస్తామని అసోసియేషన్ అధ్యక్షులు సి సి కేశవరావు, కార్యదర్శి పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి),కోశాధికారి డి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బాధితుల వివరాలను (కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, వైద్యులు రాసిన మందులు స్లిప్పులు ) అసోసియేషన్ కార్యదర్శికి చూపించాల్సి ఉంటుంది.
సంప్రదించాల్సిన ఫోన్నెంబర్లు..: జర్నలిస్టు కోవిడ్ బాధితులు నగరంలోని పల్లపోతు మురళీకృష్ణ (సెల్నం. 9885061117), చుట్టుగుంటలోని సప్తగిరి కాలేజీ ఎదుట గల నందన్ మెడికల్స్ యజమాని చిక్కవరపు( సెల్నం.9246412323), శ్రీవిఎస్డి మెడికల్ ఏజెన్సీస్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, భవానిపురం (నం. 9849083582), వన్టౌన్ లోని వట్టూరివారి వీధిలోని భాస్కర మెడికల్స్ (నం. 9848177337 ), కాటంరాజువారి వీధిలోని రామాంజనేయు మెడికల్ ఏజెన్సీస్ (నం.9848015401) పాతబస్తీలోని యూనికేర్ ఫార్మా (నం.9848015401) లను సంప్రదించాలని అసోసియేషన్ వారు తెలిపారు.