NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌ర్నలిస్ట్ వినోద్ దువా మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్:​ ప్రముఖ జ‌ర్నలిస్ట్ వినోద్ దువా క‌న్నుమూశారు. ఇటీవ‌ల క‌రోన బారినప‌డ్డ ఆయ‌న ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఇండియాలోని టీవీ జ‌ర్నలిజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ దువా.. ఎన్డీటీవీ, ది వైర్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల‌తో క‌లిసి ప‌నిచేశారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌\ను వినోద్ దువా కుమార్తె మ‌ల్లికా దువా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. ` మ‌నం ఎంత‌గానో ఆరాధించే వ్యక్తి.. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని త‌న తండ్రి వినోద్ దువా మ‌ర‌ణించారు. ఎప్పుడూ స‌త్యాల‌నే మాట్లాడుతూ అస‌మాన‌మైన జీవితాన్ని గ‌డిపారు` అని మ‌ల్లికా పోస్ట్ చేశారు. జ‌ర్నలిజంలో ఆయ‌న సేవ‌ల‌కు గాను కేంద్ర ప్రభుత్వం 2008లో ఆయ‌న‌కు పద్మశ్రీ పుర‌స్కారంతో స‌త్కరించింది.

About Author