NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండాలి..

1 min read
విలేకరులకు మాస్కులు అందజేస్తున్న శ్రీనివాస్​ కుమార్​

విలేకరులకు మాస్కులు అందజేస్తున్న శ్రీనివాస్​ కుమార్​

– కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ : ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ… నిరంతరం వార్తలు సేకరించి ప్రజలకు వెల్లడిస్తున్న విలేకరులకు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేయూతనివ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర శాఖ విజ్ఞప్తి మేరకు భవానిపురం ఆకుల రాజేశ్వరరావు రోడ్డులో గల శ్రీనివాస్ కుమార్ కార్యాలయంలో విలేకరులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ కరోన విళయతాండవం చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి వార్తలు సేకరిస్తున్న విలేకరులు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఏపీజేఎఫ్ నగర అధ్యక్షుడు యేమినేని వెంకట రమణ మాట్లాడుతూ విలేకరుల సంక్షేమం కోరి వారికి మాస్కులు అందించిన ఆకుల శ్రీనివాస్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నగర శాఖ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, సంయుక్త కార్యదర్సులు పొన్నపల్లి వీరభద్రచారి (బాబ్జి),జిర్రా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బి మురళీకృష్ణ, అలాగే ఆకుల శ్రీనివాస్ కుమార్ తనయుడు విజయ కుమార్, కాంగ్రెస్ పార్టీ నగర ఎస్ సి సెల్ చైర్మన్ పొదిలి చంటిబాబు,వైసీపీ నాయకులు అల్లం పూర్ణ,బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడు అవినాష్,తదితరులు పాల్గొన్నారు.

About Author