జర్నలిస్టుల స్థలంలో మౌలిక వసతులు కల్పించండి..!
1 min readకలెక్టర్కు విన్నవించిన జర్నలిస్టులు
పుష్పగుచ్చంతో నూతన కలెక్టరుకు స్వాగతం పలికిన ఏపీజేఎఫ్ నాయకులు
పల్లెవెలుగు వెబ్: జగన్నాథ్ గట్టులోని జర్నలిస్టు స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా నూతన కలెక్టర్ డా. జి సృజనకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో విన్నవించారు. కర్నూల్ జగన్నాథ గట్టులో సర్వే నెంబర్ 478లో 2009లో 15.44 ఎకరాల భూమిని అప్పటి మార్కెట్ రేటు కు ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం దాదాపు రూ. 66 లక్షలు ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం భూమి అప్పగించగా 254 మంది జర్నలిస్టులకు ఫ్లాట్లు వేసి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కానీ అప్పటినుంచి జర్నలిస్టు స్థలాలకు లింక్ రోడ్డు నేటికి చూపలేదు అన్నారు. వీటివల్ల ప్లాట్లను అభివృద్ధి చేసుకోలేకపోయామన్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి పేదలైన జర్నలిస్టు స్థలాల్లో విద్యుత్తు, రహదారులు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కు విన్నవించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కు స్వాగతం పలుకుతూ పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, సాయి కుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, జర్నలిస్ట్ ఎయిడెడ్ మ్యూచువల్లీ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు మధు సుధాకర్, ప్రసాద్, శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.