జర్నలిస్టులు ఆరోగ్యవంతంగా ఉండాలి
1 min read– ఆమీలియో హాస్పిటల్ ఎం. డి. Dr. లక్ష్మీ ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జర్నలిస్టులు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజానికి ఆరోగ్యకరమైన వార్తలు అందించగలుగుతారని పలువురు సీనియర్ జర్నలిస్టులు ,ప్రముఖ వైద్యులు అభిప్రాయపడ్డారు .నిత్యం వార్తా సేకరణలో ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు .మంగళవారం కర్నూలు సమాచార భవన్ ఆవరణంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జా ప్ ఆధ్వర్యంలో అమీలి యో హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఉచిత వైద్యశిబిరానికి పలువురు సీనియర్ జర్నలిస్టులు ,ప్రముఖ వైద్యులు హాజరయ్యారు .ఈ సందర్భంగా అమీలి యో హాస్పిటల్ ఎండి లక్ష్మీప్రసాద్ ,జా ప్ జిల్లా గౌరవాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, గౌరవ సలహాదారులు టి. విజయ్ ,జా ప్ జిల్లా అధ్యక్షులు తుగ్గలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అమీలి యో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ, నిష్ణాతులైన వైద్యులు హాజరై జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా బిపి, షుగర్ ,ఈసీజీ, గుండె సంబంధిత 2d ఎ కో,కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ,ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా అమీ లియో హాస్పిటల్ ఎండి డా.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అమీ లియో హాస్పిటల్ లో ఉచితంగా ఓపివైద్య సేవలు అందిస్తామని చెప్పారు .ప్రతి జర్నలిస్టు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జా ప్ జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ ,గౌరవ సలహాదారులు టి విజయ్, జా ప్ కర్నూలు జిల్లా అధ్యక్షులు తుగ్గలి శ్రీనివాస గౌడ్ ాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే జా ప్ లక్ష్యమని చెప్పారు .విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండా లనే ఉద్దేశంతో జా ప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు .నిరంతరం జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్జన్ డాక్టర్ గౌరప్ప, అసిస్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ యశోద ,అసిస్టెంట్ ఆప్తల మాలజిస్ట్ డాక్టర్ షహిస్తా షరావత్, ఏజీఎం విష్ణువర్ధన్ రెడ్డి, 2d ఎకో టెక్నీషియన్ శిరీష, పిఆర్వో వరప్రసాద్ తో పాటు అమీలియా హాస్పిటల్ సిబ్బంది హాజరై, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.