PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులను ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా గుర్తించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: జర్నలిస్టులను ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా గుర్తించాలని సీపీఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆదివారం స్థానిక పటేల్​ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోన సోకి 60 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా జర్నలిస్టులను గుర్తించారని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్​గ్రేషియాతోపాటు కరోన పాజిటివ్​ బాధితులకు రూ.20వేలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు శంకర్, రాము, శాలు, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు దానమ్మ, జయమని, నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు.

About Author