జర్నలిస్టు స్థలలా అభివృద్ధికి సహకరించాలి
1 min read–టీజీవి కి ఏపీజేఎఫ్ నాయకుల వినతి.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని దిన్న దేవరపాడు పరిధిలో గల జర్నలిస్టు స్థలాల అభివృద్ధికి సహకరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిజెపి జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ ను మంగళవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం (Apjf) జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి, జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు సాయికుమార్ నాయుడు మంగళవారం మర్యాదగాపూర్వకంగా కలిసి వినతిoచారు. 2009లో సొసైటీ అధ్యక్షులు కృపావరం, హరినాథ్ రెడ్డి , గోరంట్లప్ప నేతృత్వంలో 254 మంది పైగా జర్నలిస్టులకు సొసైటీ ఆధ్వర్యంలో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. అప్పట్లో ప్రభుత్వంతో సంప్రదించి భూమి నామినల్ ధరకు ఇప్పించడంలో టీజీ పాత్రని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇందుకు స్పందించిన టీజీ వెంకటేష్ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేందుకు ప్రతిపాదనలు ముందుకు తెస్తే ..తన వంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని జర్నలిస్టులు టీజివీ ని కోరారు. అంతకుముందు జగన్నాథ గట్టు జర్నలిస్టు స్థలాల అభివృద్ధిపై సొసైటీ కార్యదర్శి మహేష్ తో సమీక్షించారు. అవసరమైతే అనంతపురం జిల్లాకు చెందిన ఆర్ డి టి సంస్థతో తో సంప్రదించి జర్నలిస్టు స్థలాలను అభివృద్ధి చేసెలా ముందుకు వెళ్దామని చర్చించారు. ఇందుకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల అందరి సహకారంతీసుకొని ముందుకు వెళ్లాలని కార్యదర్శిని కోరారు. టీజీ వెంకటేష్ కలిసిన వారిలో ఏపీజే ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం జిల్లా నాయకులు.హేమంత్ రాఘవేంద్ర గౌడ్.శ్రీనివాసులు.. అశోక్.సుదర్శన్.ఉరుకుందు నరసింహ.సురేష్.. సూరి.ఆనందు. మధుసూదన్ రావు..తదితరులు పాల్గొన్నారు.