97 సంవత్సరాల వృద్ధునికి ఆర్థిక సహాయం అందించిన జర్నలిస్టులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన దుర్గి శాంతయ్య 97 సంవత్సరాల వృద్ధునికి గత రెండు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛను తొలగించడం జరిగింది. ప్రభుత్వానికి అధికారులకునాయకులకు ఎన్ని విన్నపాలు చేసిన ఎవరు పట్టించుకోకపోవడంతో హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సేవ సంస్థ గత 20 నెలలుగా అతనికి ఆర్థికంగా చేయితనందిస్తూ ఆరోగ్యపరంగా సేవలు చేస్తూ వస్తుంది హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరిసింహనాయుడు పిలుపుకు స్పందించిన సోషల్ మీడియా జర్నలిస్టులు ఖాజా హుసేన్ గంగాధర్, మౌలాలి తమ వంతుగా ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 97 సంవత్సరాల వృద్ధుని మీద అధికారులు నాయకులు కనికరం చూపించి ఆయన పింఛన్ పునరుద్ధరించాలని ఇంతటి వృద్ధుల మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి వారికి పించన్, ఆరోగ్య వసతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ సిటిజన్ నాగప్ప, వెల్దుర్తి మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఖాజ హుస్సేన్, మౌలాలిగంగాధర్ నాయుడు.