దామోదరం సంజీయయ్య బాల సదన్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి , మరియు LSUM కమిటీ సభ్యులైన వెంకట హరినాథ్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మరియు శివరాం, డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్, రాయపాటి శ్రీనివాసులు, పారా లీగల్ వాలంటీర్ లు కలసి గురువారం నాడు పెద్దపాడు నందుగల దామోదరం సంజీయయ్య బాల సదన్ ను తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో బాలల సంక్షేమం కొరకు, వారికి న్యాయ సహాయం అందించడం కోసం LSUM కమిటీని ఏర్పాటు జరిగిందని తెలియజేశారు. బాల సదన్ నందు పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఆరోగ్య మరియు సంరక్షణ గురించి తనిఖీ చేసారు. అనంతరం బాల సదన్ నందు భోజన శాల మరియు పిల్లల రూమ్ నందు పై కప్పు పేచ్చులు ఉడుతుండడాన్ని గమనించి పై అధికారుల కు తెలియ జేసీ వాటిని బాగు చేసేలా చేస్తామని తెలిపారు.బాల సదన్ నందు సీసీ కెమెరా లు సరిగ్గ పనిచేసేలా చూడాలని సిబ్బంది ని ఆదేశించారు.