PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపిని గెలిపించేందుకు క‌ష్టప‌డాలి..

1 min read

క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క‌ష్టప‌డాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో తెలుగుయువ‌త పార్లమెంట్ సెక్రట‌రీ మోతీలాల్ ఆధ్వర్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులతో టి.జి భ‌ర‌త్‌ స‌మావేశమ‌య్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ లెవ‌ల్‌లో ఉన్నార‌న్నారు. ఎన్టీఆర్ దృష్టంతా ఇప్పుడు సినిమాల‌వైపే ఉంద‌న్నారు. టిడిపిని వ‌దిలేది లేద‌ని గ‌తంలో ఎన్టీఆర్ చెప్పిన‌ట్లు టి.జి భ‌ర‌త్ గుర్తుచేశారు. అందుకే ప్రతి ఒక్క అభిమాని టిడిపి విజ‌యం కోసం కృషి చేయాల‌ని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే యువ‌త‌కు మంచి భ‌విష్యత్తు ఉంటుంద‌న్నారు. 20 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పించేందుకు చంద్రబాబు విజ‌న్‌తో ప‌ని చేస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ అభిమానులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author