PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల జిల్లాలో జూనియర్ /యూత్ రెడ్ క్రాస్ లను విస్తరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  రెడ్ క్రాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులో వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా  యువతకు స్వచ్ఛంద సంస్థలకు అధికారులకు పిలుపునిచ్చిన జాయింట్ కలెక్టర్జూనియర్/యూత్ రెడ్ క్రాస్ చైర్మన్ & జిల్లా జాయింట్ కలెక్టర్  జూనియర్ యూత్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి  అధ్యక్షతన కలెక్టర్  కార్యాలయం వి సి హాల్ లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్ యూత్ రెడ్ క్రాస్ జిల్లా స్థాయి సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ పుల్లయ్య , రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల , జిల్లా అధికారులు జూనియర్ యూత్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు డీఈవో సుధాకర్ రెడ్డి , జిల్లా వైద్యశాఖ ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ , జిల్లా కోపరేటివ్ అధికారి మరియు జిల్లా రెడ్ క్రాస్ జనరల్ సెక్రెటరీ శ్రీ వెంకటసుబ్బయ్య వివిధ కళాశాలల పాఠశాలల ప్రిన్సిపాల్ విద్యార్థులు ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో 8వ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థుల వరకు మరియు ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులతో జూనియర్ రెడ్ క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే డిగ్రీ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో ఇతర యూత్ క్లబ్ లో యూత్ రెడ్ క్రాస్ టీంలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే విధంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు విధాలుగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.అలాగే యూత్/జూనియర్ రెడ్ క్రాస్ కమిటీలుమండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసుకోవాలని తద్వారా మారుమూల ప్రాంత విద్యార్థులతో కూడా సేవా కార్యక్రమాలైన రక్తదానంపై అవగాహన పచ్చదనం పరిశోధన పరిశుభ్రత పై అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారరెడ్ క్రాస్ లో స్వచ్ఛందంగా సేవలందించాలనుకున్న ప్రతి ఒక్కరూ, విద్యార్థిని, విద్యార్థులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, అధికారులు అందరూ కూడా రెడ్ క్రాస్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్  సూచించారు.

About Author