PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తక్షణమే జూపాడు బంగ్లా  మండలాన్ని కరువు మండలంగా గుర్తించాలి

1 min read

జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన ‘డి’ పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాలి.. 

పల్లెవెలుగు  వెబ్  నందికొట్కూరు:  నందికొట్కూరు నియోజకవర్గం లోనే అత్యధికముగా మెట్ట భూములు కలిగి వర్షభావం  వలన మాత్రమే పంటలు పండే భూములు అధికంగా ఉన్నాయని తక్షణమే జూపాడు బంగ్లా  మండలాన్ని కరువు మండలంగా గుర్తించాలని,జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన డి ఫారం పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాలని సిద్దేశ్వరం గ్రామ గిరిజనులకు విద్యుత్తు,పక్కా గృహాలు నిర్మించాలని, జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, చాబోలు గ్రామస్తులను ఆదుకోవాలని, నకిలీ విత్తనాలు, మందులు అరికట్టాలని  కోరుతూ నందికొట్కూరుకు విచ్చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కి సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సీపీఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గం లో ఉన్న ఆరు మండలాల్లో మెట్ట భూముల అధికంగా ఉన్నాయని కేసీ కెనాల్ ప్రాంతం ఈ సీజన్లో సక్రమంగా సాగునీరు అందక రైతుల తీవ్ర నష్టాలలో కూరుకుపోయారన్నారు. తక్షణమే జూపాడుబంగ్లతో పాటు మిగిలిన మండలాలను కరువు మండలాలగా ప్రకటించాలని వారు జేసీని కోరారు. అదేవిధంగా జాతీయ రహదారి పనులలో ఈ ప్రాంత డి.పట్టాదారులు అత్యధికంగా భూములు కోల్పోయారని వారికి తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని వారు కోరారు. జూపాడుబంగ్లా మండలంలో ఉన్న గురుకుల పాఠశాలలో గత ఏప్రిల్ లో ప్రహరి గోడ లేక విద్యార్థి బావిలో పడి మృతి చెందాడని తక్షణమే పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.డిసిఒ  ప్రత్యక్షంగా చూసిన స్పందించడంలో విఫలం చెందారని ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.. పారుమంచాల మజారా సిద్దేశ్వర గ్రామ గిరిజనులు అసౌకర్యాల మధ్యన జీవనం కొనసాగిస్తున్నారని కనీసం విద్యుత్ సౌకర్యం లేదని తక్షణమే పక్కా గృహాలు సిసి రోడ్లు నిర్మించి విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వారు కోరారు.. బ్లాస్టింగ్ వల్ల దెబ్బ తిన్న చాబోలు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఆదుకోవాలని అన్నారు. నకిలీ మందులు విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న షాపుల యజమానులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమస్యలపై జేసీ గారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author