చట్టాల పై న్యాయ విజ్ఞాన సదస్సు..
1 min read– సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్.కవిత
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కడప వారి ఆధ్వర్యంలో చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం బాల్య వివాహాలు,భూ తగాదాలు, టోల్ ఫ్రీ నెంబర్ లైన 1098, 14567 అనే అంశాల పైనసెక్రెటరీ కం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్.కవిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఉచిత న్యాయ సహాయం గురించి సీనియర్ సివిల్ జడ్జి వివరించారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏదైనా పథకాలు అందనివారు తమ అర్జీలను న్యాయ సేవ అధికార సంస్థ వారికి ఇచ్చినచో న్యాయ సేవ అధికార సంస్థ వారు సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు.బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని టోల్ ఫ్రీ నెంబర్ 1098 పై అవగాహన కలిగించారు.బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం ఇచ్చినట్లయితే తగు చర్యలు తీసుకుంటారన్నారు.ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.అలాగే భూ తగాదాల కేసులపై అవగాహన కలిగించారు.సీనియర్ సిటిజన్స్ కు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 14567 సంప్రదించవచ్చునని వారు వెంటనే తగు చర్యలు తీసుకుంటారని సూచించారు. ఫ్రీ లిటిగేషన్ కేసులపై, జాతీయ లోక్ అదాలత్ ల పైన అవగాహన కలిగించారు.రాజీ మార్గమే రాజ మార్గమని.సత్వర పరిష్కారానికి మార్గము లోక్ అదాలత్ అన్నారు.పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని నిర్బంధ ప్రాథమిక విద్యపై అవగాహన కలిగించారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2015 ను వివరించారు.లీగల్ ఎయిడ్ క్లినిక్స్,ప్యానల్ న్యాయవాదులు, పార లీగల్ వాలంటరీల విధివిధానాలు తెలియజేశారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,మండల న్యాయ సేవా సమితి విధివిధానాలు తెలియజేశారు.ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కడప వారి దృష్టికి తీసుకొని రావచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి,ఎంపీపీ చీర్ల సురేష్ బాబు.ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి,ఎంపీడీవో జాన్ వెస్లీ, సర్పంచ్ ఈఓపిఆర్డీ సురేష్ బాబు,శ్రీ లక్ష్మి,పారా లీగల్ వాలంటరీ అరుణకుమారి,పంచాయతీ కార్యదర్శి అన్వర్ బాషా,ఎర్రసాని మోహన్ రెడ్డి, ఎస్.శ్రీనివాసులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు.