రైతన్నకు న్యాయమేదీ..!
1 min readకర్నూలులో గర్జించిన రైతులు..
- కలెక్టరేట్ వద్ద బైఠాయింపు..
- రుణమాఫీ…కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్
- ఏపీలో కాంగ్రెస్ హవా : ఏపీ సీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
రైతుల ర్యాలీ విజయవంతం: ఏపీసీసీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి
పల్లెవెలుగు:రైతులను నమ్మించి..మోసం చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ఘాటుగా విమర్శించారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కరువు జిల్లాలో సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ… మంగళవారం కర్నూలులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ ఏడాది గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా కరువు రాకేసి కరాళ నృత్యం చేస్తోందని, జూన్ నుంచి నేటి వరకు 729 మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, 26 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 685 మండలాలు ఉండగా 449 మండలాలు తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు.
సాగుభూమి..ఎండు ముఖం..
ఏడాది కరీఫ్లో 40% సాగు భూమిలో వర్షం పడని కారణంగా పంటలు వేయలేక పంట వేసి 60% సాగు భూముల్లో కూడా పంటలు ఎండిపోయాయి భూగర్భ జలాల మొత్తం పడిపోయింది భూగర్భ జలాలు ఉన్నచోట కూడా విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయాయి చాలా ప్రాంతాల్లో ఉపాధి పనులు లేక వృద్ధులు చిన్న బిడ్డలను వదిలి ప్రజలు వలస పోతున్నారు కొన్నిచోట్ల ఏర్పడింది.
కర్ణాటకలో కేంద్రం పరిశీలన.. ఏపీలో కంటి తుడుపు..!
కర్ణాటక ప్రభుత్వం సెప్టెంబర్ 24న కరువు ప్రాంతాలను ప్రకటించింది కేంద్రం అధికారుల బృందం వచ్చే క్షేత్రస్థాయిలో చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు కానీ మన రాష్ట్రంలో తిరగ అక్టోబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం సౌజన్య మాది కూడా కంటితుడుపు చర్యగా ఏడు జిల్లాల్లో నూట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది అందులో కూడా 8 మండలాలలో కరువు తీవ్రంగా ఉన్నట్లు 23 మండలాల్లో ఒక మోస్తారుగా ఉన్నట్లు ప్రకటించింది రాష్ట్రంలో 18 జిల్లాల్లో 449 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండగా కేవలం ఏడు జిల్లాలలో 13 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం దురదృష్టకరం .
కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు:
వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి
కొత్త వ్యవసాయ రుణాలు ఇవ్వాలి
కరువు పరిస్థితులపై పునర్ పరిశీలన జరిపి 18 జిల్లాలను 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
కరువు సహాయక చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలి
ప్రత్యామ్నాయ పంటల విధానం అమలు చేయాలి
ఉపాధి పనులు పెద్ద ఎత్తున చేపట్టి వలసలు నివారించాలి
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి
పంట నష్టపరిహారం వెంటనే 50వేలు చెల్లించాలి అన్ని పంటలకు సమగ్ర పంటలకు బీమా పథకాన్ని అమలు చేయాలి
వ్యవసాయ రంగానికి విద్యుత్ కోదలు నివారించాలి
పశుగ్రాసాన్ని సరఫరా చేయాలి తాగునీటి కొరత లేకుండా చూడాలి.
రబి పంటకు ఉచితంగా మలురక్క విత్తనాలు సరఫరా చేయాలి
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వం వ్యక్తులు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సి డబ్ల్యూ సి మెంబర్ ఎన్ రఘువీర రెడ్డి, ఏపీసీసీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి గారు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి , నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు జే లక్ష్మి నరసింహ యాదవ్, కర్నూల్ జిల్లా అధ్యక్షులు కె బాబు రావు, కేంద్ర మాజీ మంత్రులు జేడి శీలం గారు , చింత మోహన్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జంగ గౌతం గారు ,ఏపీసీసీ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి లమ్ తంతియకుమరి గారు , కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధం గారు , యస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ సాకే శంకర్ గారు,ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ గారు , ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు , నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి గారు ,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి స్వామి , జిల్లా కార్యదర్శి జనార్ధన్ , పాణ్యం నియోజకవర్గం కోఆర్డినేషన్ మెంబర్ సాంబశివుడు , బనగానపల్లె నియోజకవర్గం కోఆర్డినేషన్ సభ్యులు బాలు యాదవ్ , నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగలింగం , ఆళ్లగడ్డ నియోజకవర్గం కోఆర్డినేషన్ సభ్యులు బరగోడల హుస్సేన్ భాష , రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి శంసులు హక్ , శ్రీశైలం నియోజకవర్గం కోఆర్డినేషన్ సభ్యులు అసర్ ఇస్మాయిల్ , జిల్లా ఉపాధ్యక్షులు బోయ రమణ , అమర్నాథ్ యాదవ్ , ఏపీసీసీ యస్సీ సెల్ కార్యదర్శి కరాటే బాలకృష్ణ , నంద్యాల పట్టణ అధ్యక్షులు చింతలయ్యా , రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ రాంభూపాల్ యాదవ్, డోన్ మండల అధ్యక్షులు వద్దే రాజశేఖర్ , డోన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ యాదవ్ , జలదుర్గం నాగరాజు , మహేంద్ర , లోకనత్, తదితరులు పాల్గొన్నారు.