టీడీపీతోనే.. కార్మికులకు న్యాయం:టీజీ భరత్
1 min readకర్నూలు, పల్లెవెలుగు:తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని మౌర్య ఇన్‌లోని ఆయన కార్యాలయంలో టి.ఎన్.టి.యూసి ఆధ్వర్యంలో టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టేబోయే కార్మిక చైతన్య బస్సు యాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రభుత్వంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించడం కోసం ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. దీంతో పాటు 2024లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేయడం జరుగుతుందన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా కార్మికులకు ఆయన ఇచ్చిన హామీలను గుర్తి చేసి వారిలో మనోధైర్యం నింపడం జరుగుతుందన్నారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం టి.ఎన్.టి.యూ.సి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌టియూసీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహులు, కర్నూలు సిటీ ప్రెసిడెంట్ పాల్‌రాజ్, నేతలు ప్రభాకర్, దశరథరామనాయుడు, చెన్నకేశవులు, పుల్లయ్య, రమణారావు, రమణ, రామకృష్ణ, షాషా, హుశేన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.