కాపు నేస్తం అర్హులకు న్యాయం చేయాలి
1 min read– కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కాపు నేస్తం పథకానికి అర్హులైన బలిజ కులస్తులకు న్యాయం చేయాలని కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బసిరెడ్డి రాజేష్ రాయల్, జనసేన జిల్లా ఇంఛార్జ్ పవన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని సంక్షేమ భవన్ నందు బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగశివలీలకు వినతి పత్ర అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన బలిజలను సంబంధం లేని కారణాలతో కాపు నేస్తం పథకానికి అనర్హులుగా ప్రకటిస్తూ వారి దరఖాస్తులను తిరస్కరించారని అట్టి దరఖాస్తులు పునః పరిశీలన జరిపి బలిజలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన జిల్లా నాయకులు గద్యాల రమేష్, కటకం రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు.