NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ రాజధానిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

1 min read


పల్లెవెలుగు వెబ్: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక అంశాలను లెవనెత్తారు. అస‌లు న్యాయ‌రాజ‌ధాని అంటే ఏమిటి? పాల‌న వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టంలో క‌ర్నూలులోనే హైకోర్టు ఉండాల‌న్నదానిపై స్పష్టత లేదన్నారు. ఇప్పటికే లోకాయుక్తా, మాన‌వ‌హ‌క్కుల సంఘాలు కర్నూలులో ఏర్పాటు అయ్యాయన్నారు. హైకోర్టు ప్రధాన బెంచ్ అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేష‌న్ ఇచ్చారని… కేంద్రం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నంత‌వ‌ర‌కు అమ‌రాతి నుంచి హైకోర్టు ఎక్కడికి పోదన్నారు. దీంతో హైకోర్టు లేకుండా క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని ఎలా సాధ్యమని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. క‌ర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని పాల‌న‌వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టంలో ఉంది. అయితే అలాంటి హామీని చ‌ట్టంలో రూపొందించ‌వ‌చ్చా ? అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు.

About Author