బాబు కు న్యాయం చేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: బాబు సౌర్య విషయంలో జరిగిన అన్యాయం పై మాచర్ల గవర్నమెంట్ ఆసుపత్రి స్టాప్, డాక్టర్ పైన విచారణ జరిపించాలని ఎస్.జె.హెచ్.ఎఫ్ నేషనల్ చైర్ పర్సన్, విజయచిలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ డాక్టర్ నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రి “అమ్మ” ను మూసివేసి డాక్టర్ ని సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు. బాబు సౌర్య కు జరిగిన అన్యాయం పై తల్లిదండ్రులు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు.ఈ సందర్భంగా బాబు సౌర్య తల్లి కాకాని స్వరూప మాట్లాడుతూ తనది నరసాపురం అని తనకు సెప్టెంబర్ 30న మాచర్ల గవర్నమెంట్ ఆసుపత్రిలో బాబు సౌర్య పుట్టాడని చెప్పారు. ప్రసవ సమయంలో నర్సుల నిర్లక్ష్యం వల్ల మా బాబు చిటికెన వేలు తెగిందని దానికి వారు తమకు చెప్పకుండా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తన బాబుకు చికిత్స చేయలేమని చేతులెత్తేసారని వాపోయారు.ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన బాబు చిటికినవేలి కి కుట్లు వేసి కట్టుకట్టారని కన్నీరు మున్నయ్యారు.ఎస్.జె.హెచ్.ఎఫ్ నేషనల్ చైర్ పర్సన్, విజయచిలీ మాట్లాడుతూ బాబు విషయంలో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల బాబు జీవితం నాశనమైనదని వెంటనే వాళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వెంటనే ప్రభుత్వ డాక్టర్ నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రి “అమ్మ” ను మూసి వేయించి అతన్ని సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎఫైఆర్ నమోదు చేసి అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. బాబు శౌర్య జీవితం నాశనం చేసినందుకు గాను ప్రభుత్వం అతని తండ్రికి ఉద్యోగం, నష్టపరిహారం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇప్పించాలని డిమాండ్ చేశారు.సమావేశంలో బాబు తండ్రి కాకని ప్రసాద్, బంధువులు పాల్గొన్నారు.