PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డి.ఎస్.సి.క్వాలిఫైడ్ టీచర్స్ కు న్యాయం చేయాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 1996 డి.ఎస్.సి. క్వాలిఫైడ్ టీచర్స్ అసోషియేషన్ అలంకార్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం నుండి వచ్చిన 1996 వ బ్యాచ్ కి చెందిన డి. ఎస్. సి క్వాలిఫైడ్ టీచర్ గోపాలరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 1998 వ బ్యాచ్ కి ఉద్యోగ అవకాశం కల్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపారో అదే బాటలో రాష్ట్రంలో ఉన్న 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,1996 డి.ఎస్.సి.క్వాలిఫైడ్ టీచర్స్ కు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని చెప్పుటలో సందేహాం లేదని,లోకల్ మరియు నాన్ లోకల్ రిజర్వేషన్ల భర్తీ 80:20 కి బదులుగా 70:30 ప్రాతిపదికన, మహిళా రిజర్వేషన్స్ 30% కాగా 33.3% ఇవ్వటం, మాజీ సైనికుల భర్తీ లో వ్యత్యాసం వలన మరియు ఆనాటి జిల్లా సెలక్షన్ కమిటీ మౌఖిక పరీక్షలలో 15 మార్కులు కేటాయించగా , గత ప్రభుత్వం వారికి కావలసిన అభ్యర్థులకు 13 లేక 14 మార్కులు కేటాయించి మిగిలినవారికి అతి తక్కువ మార్కులు కేటాయించడం వలన మేము ఉద్యోగావకాశాలను కోల్పోయామన్నారు.గతంలో వైయస్.రాజశేఖర్ రెడ్డి మా క్వాలిఫైడ్ మిత్రులందరికి నేరుగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి ఆనాటి ప్రముఖ దినపత్రికలలో కూడా ప్రచురితమయ్యిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టు కోవడంలో మన ప్రభుత్వం “మాట తప్పడం-మడము తిప్పడం” అనేది చరిత్ర లోనే లేదన్నది నిజం మన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుండి 1996 డి.ఎస్.సి.క్వాలిఫైడ్ టీచర్స్ పాల్గొన్నారు.

About Author