విద్యా ఉపాధి రంగాలలో ముస్లింలకు న్యాయం జరగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా వితంతు నిరుపేదలకు చీరలు ప్యాంట్లు, షర్ట్లు పంపిణీ కార్యక్రమం జరిగిందని ,దేశంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు , నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అని .ప్రస్తుత జరగబోయే కర్ణాటక రాష్ట్రఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నదని పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని , విద్యా ఉపాధి రంగాల్లో న్యాయం జరగాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువులు అందించాలని ,గత ప్రభుత్వంలో రంజాన్ తోఫా, దుల్హన్ ,పథకం నిధులు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు నిధులు విజయవాడలో హజ్ హౌస్ ,నిర్మాణం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు లోన్ సదుపాయం కలిగించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా, ఉపాధి ,రంగాలలో ముస్లింలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందాలని, ముస్లింలకు న్యాయం జరగాలని ,రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అందవలసిన సంక్షేమ పథకాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ,. ముస్లింలకు విదేశీ విద్య కొరకు నిధులు కేటాయించాలని, ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం ఉన్న రిజర్వేషన్ కూడా తూట్లు పొడుస్తున్నారు . అధికారంలో ముస్లింలకు భాగస్వామ్యం చేయడంలో విఫలం అయిందని ,ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ,రంజాన్ సందర్భంగా ముస్లింలకు10 వేలు ఆర్థిక సాయం అందించాలని, అన్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 18 వేల కోట్ల రూపాయలు పార్టీ నిధులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదా, రామారావు, బాబ్జి, తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.