సుప్రీం చీఫ్ గా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
1 min read
పల్లెవెలుగువెబ్ : భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ స్థానంలో సుప్రీం పీఠం అధిరోహించారు. రాష్ట్రపతిభవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించారు. ప్రమాణం తీసుకున్న వెంటనే సరాసరి తన తండ్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఉమేశ్ రంగనాథ్ లలిత్ (90) సహా కుటుంబంలోని పెద్దల పాదాలు తాకి వారి ఆశీర్వాదాలను ఆయన పొందారు. ఈ ఏడాది నవంబరు 8వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.