బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలేని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు ఆయన సేవలను కొనియాడారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాబురావు మాట్లాడుతు జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని. పూలె వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకు వచ్చారని శూద్రులకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందని అప్పటి బ్రిటీష్ పాలకులతో పాఠశాలలు ఏర్పాటు చేయించారని కనుక సమాజంలో నిమ్న జాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో, ఎలా అణచివేయ బడుతున్నారో చూసి వారికి ప్రతిఘటన మార్గం చూపించారని ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో పూలే ని ఆదర్శంగా తీసుకోవాలని బాబురావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పిజి రాంపుల్లయ్య యాదవ్, కోడుమూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణ, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న, పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, పిసిసి అధికార ప్రతినిధి బి రామాంజనేయులు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, ఐఎన్ టి యుసి జిల్లా అధ్యక్షులు బి బతకన్న, డిసిసి ప్రధాన కార్యదర్శులు కే సత్యనారాయణ గుప్త, ఎన్ చంద్రశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట రాముడు కె రవికుమార్ కాంగ్రెస్ నాయకులు పీజీ నరసింహులు యాదవ్ పసుపుల ప్రతాపరెడ్డి షేక్ మాలిక్ భాష జాన్ సదానందం డిసిసి కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు లలిత కె వెంకటలక్ష్మి హైమావతి మద్దమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.