అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే…
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే అని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అన్నారు.జ్యోతిరావు పూలే 133 వ వర్ధంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా,కాంతి రేఖగా నిలిచారన్నారు. పూలే ఆశయాలకనుగుణంగా జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందన్నారు.బిసి లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని సీఎం జగన్ నిరూపించారన్నారు.56 బిసి కార్పొరేషన్లకు ఒకే సారి పాలక మండల్లును ఏర్పాటు చేశారన్నారు. ఉద్యమ కర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు.సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ షూకూర్ , మున్సిపల్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ , వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , వైసీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సగినేల వెంకట రమణ , జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ ఇనాయతుల్లా , వైసీపీ నాయకులు తమడపల్లి విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి పెరుమాళ్ల జాన్ , మాజీ సింగిల్ విండో ఛైర్మన్ చందమాల. బాలస్వామి , తిమ్మాపురం నాగన్న , ముజీబ్, ఇదయతుల్లా, ప్రవీణ్, భాస్కర్, శంకరయ్య, భాస్కర్ రెడ్డి, బూషి గౌడ్, వలి బాషా, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.