ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు : యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ప్రజలకు సమాన హక్కులు కల్పించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం ఎంతగానో కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని యుటిఎఫ్ జిల్లా నాయకులు నవీన్ పాటి గారు పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్బంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.తదనంతరం యుటిఎఫ్ నాయకులు చంద్రపాల్,జిక్రియ గార్లు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు నవయుగ వైతాళికుడు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘసంస్కర్త,అంటరానితనం,వివక్ష రూపుమాపాలంటే విద్య ద్వారానే సాధ్యమని నమ్మి స్ర్తీ విద్యకోరకు పోరాడిన మహానుబావుడు. కావున ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి స్త్రీ విద్యావ్యాప్తికీ కృషి చేసినపుడే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి అని కొనియాడారు. ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను 3కి.మీ దూరం వున్న ఉన్నత పాఠశాలలోకి మెర్జ్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బాలికల డ్రాపౌట్స్ పెరిగే అవకాశం వుంది కావున ప్రాథమిక పాఠశాలలను యధావిధిగా కోనసాగించి బాలికలకు చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యను బడుగు బలహీన వర్గాల వారికీ దూరం కాకుండా చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు బాబు,నరసింహ, నాగేష్,శేఖర్,రంగస్వామి, మనోహర్,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.