NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పత్తికొండ బిజెపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బిజెపి అసెంబ్లీకో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1927 ఏప్రిల్ 11న జన్మించారని,విద్య, విజ్ఞానం పెంపొందించడానికి ఫూలే చేసిన త్యాగం గొప్పదని కొనియాడారు. జ్యోతిరావు పూలే గొప్ప విద్యావేత్త, అలాగే సంఘ సంస్కర్త కూడా అని అన్నారు.పూలే ఆయన సతీమణితో పాటు ఇద్దరూ దేశం కోసం ఒకరికొకరు విలువలను బతికించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.నవయుగ వైతాళికుడు, సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త,

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా

ఆ మహనీయుడికి మా వినమ్ర నివాళి అని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కిసాన్ మోర్చా ఇంచార్జ్ సిసి రంగన్న, అసెంబ్లీ లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ భాస్కర్, ఓబీసీ మాజీ మండల అధ్యక్షుడు కర్ణం చంద్రన్న, యువ మోర్చా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం నరేష్, ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ ఇంచార్జ్ బాబ్జి గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ ఇంచార్జ్ నగరూరు నాగ తదితరులు పాల్గొన్నారు.

About Author