అణగారిన వర్గాల ఆశాజ్యోతి… జ్యోతిబాపూలే..
1 min readలీడర్స్ యూత్ సొసైటీ మరియు నల్లా రెడ్డి ఫౌడేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేదార్ నాథ్
పల్లెవెలుగు వెబ్: కర్నూలు కేంద్రంలో బిర్లా కాంపౌండ్ దగ్గర మహాత్మ జ్యోతిబా పూలే 132వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి, లీడర్స్ యూత్ సొసైటీ మరియు నల్లా రెడ్డి ఫౌడేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేదార్ నాథ్, ఆర్య కటిక కార్పొరేషన్ గౌతం పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లీడర్స్ యూత్ సొసైటీ మరియు నల్లా రెడ్డి ఫౌడేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేదార్ నాథ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారని, ఆయన మన భారతీయ సామాజిక సంస్కర్త, మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత, సమాజంలోని సాంఘిక దురాచకాలకు వ్యతిరేకంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని అన్నారు. మరి ఈయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళల విద్యకు మార్గదర్శకురాలు, పూలే బాలికల కోసం మొట్ట మొదట పాఠశాలకు, 1848, లో పూణేలో ప్రారంభించారు. భారతదేశంలో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించి, మొట్టమొదట భారతీయులకు విద్యానందించినది, మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే అని తెలిపారు. ఆ మహనీయుని త్యాగాల వల్లే, విద్యలో జ్ఞానంతో, వారి త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లా రెడ్డి ఫౌండేషన్ సభ్యులు జేశ్వాంత్, వసంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.