NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కే. భాస్కర్ ఎన్నిక

1 min read

– న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో 13 ఓట్లతో విజయం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కాటేపోగు భాస్కర్ ఎన్నికయ్యారు. న్యాయవాదుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు నందికొట్కూరు అడ్వకేట్స్ అసోషియేషన్ ఎన్నికల అధికారి జె. వెంకట రాముడు తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి అడ్వకేట్స్ అసోషి మేషన్ నూతన కార్యవర్గము ఎన్నిక కోసం జరిపిన ఎన్నికలలో జనరల్ సెక్రటరీ గా వడ్ల శరభయ్య, కోశాధికారిగా అరుణ్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయినారన్నారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికలో సి.విజయలకమార్, కే. భాస్కర్ మధ్య పోటీ ఏర్పడింది. శుక్రవారం జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలో విజయకుమార్ కు 22 ఓట్లు వచ్చాయి. కే. భాస్కర్ కు 35 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు నోటాకు పడడంతో కె. భాష్కర్ 13 ఓట్ల మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికయినారన్నారు. ఉపాధ్యక్షుడు మరియు జాయింటు సెక్రటరీ పోస్టులకు నామినేషన్ ఎవరు వేయలేదని వాటిపై అడ్వకేట్స్ అసోసియేషన్ తర్వాత జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయాల తీసుకొంటుందని తెలిపారు . నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భాస్కర్ కు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author