కె. ఇ.శ్యామ్ బాబు పాద యాత్రకు జన ప్రభంజనం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100రోజులు పూర్తవుతున్న సందర్భంగా పత్తికొండ నియోజకవర్గంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు చేపట్టిన సంఘీభావ పాద యాత్రకు జనం పోటెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభించి వంద రోజులు చేరుకున్న సందర్భంగా సోమవారం పత్తికొండ మండలంలోని రాజుల మండగిరిలో వెలసిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు పత్తికొండ మండలంలోని ఎం అగ్రహారం గ్రామం నుండి సంఘీభావ పాద యాత్ర ప్రారంభించారు.అక్కడినుండిచిన్నహుల్తి గ్రామం మీదుగా పాదయాత్ర పెద్దహుల్తి గ్రామం వరకు పాదయాత్ర ఉత్సాహ భరితంగా సాగింది. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వ దాష్టికాలను లోకేష్ ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. ప్రజల్లో భరోసా కల్పించడంతో పాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్కడిక్కడ ప్రజలు తమ సమస్యలను నారా లోకేష్ కు విన్నవిస్తున్నారని అన్నారు.నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.జీవో-1 రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఇప్పటివరకు సీఎం జగన్ పరామర్శించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు.